Ear Pain Tips: చెవి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు ప్రయత్నించండి 1 y ago

featured-image

చెవి నొప్పి: కారణాలు, లక్షణాలు మరియు ఇంటి చిట్కాలు

చెవి నొప్పి తీవ్ర‌త‌తో కొన్ని సార్లు మీ పనులు కూడా స‌క్ర‌మంగా జరగవు. చెవి నొప్పికి అనేక కారణాలు ఉంటాయి, ఉదాహరణకు క్యావిటీస్, సైనస్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ వ్యాక్స్, టాన్సిల్స్, దంత సమస్యలు. ఇవి కాకుండా మరిన్ని కారణాలు ఉండవచ్చు. అయితే, ఈ సమస్యను తగ్గించేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగపడవచ్చు. కానీ, ఇవన్నీ పాటించే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి, ఎందుకంటే నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి, కారణాన్ని తెలుసుకుని అప్పుడు చిట్కాలను అనుసరించాలి.


కోల్డ్, వార్మ్ కంప్రెస్ ప‌ద్ధ‌తి చెవి నొప్పికి ఉప‌శ‌మ‌నం

చెవి నొప్పి తగ్గ‌డానికి చాలామంది కోల్డ్, వార్మ్ కంప్రెస్ పద్ధతిని ఉపయోగిస్తారు. కానీ ఈ ప‌ద్ద‌తిని చాలామంది క‌డుపునొప్పి త‌గ్గ‌డానికి వాడ‌తారు. హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీటిలో ముంచిన గుడ్డను నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచడం వల్ల ఉపశమనం ఉంటుంది. అలాగే, ఐస్ ముక్కలను గుడ్డలో చుట్టి కూడా వాడవచ్చు, కానీ ఎక్కువసేపు ఉంచకుండా, కొంచెం సేపు ఉంచి తీసివేయాలి.


చెవి నొప్పి నివార‌ణ‌కు హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా ఇయర్ వ్యాక్స్ కారణంగా నొప్పి వస్తే కొన్ని చుక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను చెవిలో వేయండి, కొన్ని నిమిషాల పాటు ఉంచి తలని కిందకి వంచి క్లీన్ చేయండి. ఇలా చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.


నేచురోపతిక్ డ్రాప్స్

మూలికలతో తయారు చేసిన ఈ డ్రాప్స్ హెర్బల్ మందుల దుకాణాలు మరియు ఆన్‌లైన్‌లో లభిస్తాయి. ఇవి ఆలివ్ ఆయిల్ వంటి పదార్థాలతో తయారవుతాయి. డాక్టర్ సలహాతో వాడవచ్చు.


ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీనిని కొద్దిగా గోరువెచ్చగా చేసి రెండు చుక్కలు చెవిలో వేయాలి, అయితే, వేయడానికి ముందు డాక్టర్‌ నుంచి సలహా తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారుల కోసం నూనెను మరీ వేడి చేయకూడదు.


అల్లం రసం

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీన్ని రసంలా చేసి చెవి చుట్టూ రాయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇయర్ కెనాల్ చుట్టూ రాయండి.


వెల్లుల్లి

వెల్లుల్లి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ బయోటిక్ మరియు నొప్పి తగ్గించే గుణాలు ఉన్నాయి. మెత్త‌గా దంచిన‌ వెల్లుల్లిని గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్ లేదా నువ్వుల నూనెలో నానబెట్టి, వడపోసి ఇయర్ కెనాల్ చుట్టూ రాయడం వ‌ల్ల‌ నొప్పి తగ్గుతుంది.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD